సుంకేసులకు 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

సుంకేసులకు 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

గూడూరు/శ్రీశైలం ప్రాజెక్ట్‌: సుంకేసుల బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి 7 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదు కాగా, అధికారులు ఒక స్పిల్‌వే గేటును 0.5 మీటర్ల మేర పైకి ఎత్తి 2,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 1.235 టీఎంసీల నీటి మట్టం ఉండగా, అవుట్‌ఫ్లో 4,693 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలంప్రాజెక్ట్‌: సుంకేసుల, హంద్రీల నుంచి 2,498 క్యూసెక్కులు శ్రీశైలంకు వచ్చి చేరుతున్నాయి. ప్రసుత్తం జలాశయంలో 92.9240 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 855.40 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు 10,794 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కేంద్రంలో 0.521 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 1,061 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్‌వాటర్‌ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,233 క్యూసెక్కులు, వెలిగొండ ప్రాజెక్ట్‌కు 500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,800 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

వీబీఆర్‌లో 8.853 టీఎంసీల నీటి నిల్వ

వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (వీబీఆర్‌)లో ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి 8.853 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలుగు గంగ అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ ప్రస్తుత నీటిమట్టం 259.21 మీటర్లు (850.425 అడుగులు)గా నమోదైంది. ప్రస్తుతం రిజర్వాయర్‌కు టీజీపీ లింక్‌ ఛానల్‌, క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదని అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ నుంచి మొత్తం 450 క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతోంది. ఇందులో టీజీపీ ప్రధాన కాలువకు 350 క్యూసెక్కులు, వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు సరఫరా అవుతున్నాయి. 1ఎల్‌, 1ఆర్‌ కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement