టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

బనగానపల్లె: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఎస్సార్బీసీ కాల్వ వద్ద టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు.కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాగంటిపల్లె గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరెడ్డి, సర్వసతి దంపతులకు ఇద్దరు సంతానం కాగా కారీక్‌రెడ్డి (6)చిన్నవాడు. ఆదివారం ఉదయం పెదనాన్న శివారెడ్డితో కలిసి కార్తీక్‌రెడ్డి బనగానపల్లె కూరగాయల మార్కెట్‌కు బైక్‌పై వచ్చారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఎస్సార్బీసీ కాల్వ సమీపంలో శివారెడ్డికి ఫోన్‌ రావడంతో బైక్‌ను సైడ్‌కు ఆపి మాట్లాడుతున్నాడు. అక్కడే ముందుభాగంలో లోడ్‌తో టిప్పర్‌ ఉంది. డ్రైవర్‌ గమనించకుండా స్పీడ్‌గా టిప్పర్‌ను వెనుకకు కదిలించడంతో ద్విచక్రవాహనంపై ఉన్న కార్తీక్‌రెడ్డి టిప్పర్‌ టైర్‌ కిందపడి అక్కడిక క్కడే మృతి చెందాడు. శివారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయం ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో ఆడుకుంటూ సరదాగా గడిపిన బాలుడు ఇలా ఆకస్మత్తుగా ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement