శోభాయమానంగా సీమోల్లంఘన | - | Sakshi
Sakshi News home page

శోభాయమానంగా సీమోల్లంఘన

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

పీఠాధిపతి 48 రోజుల చాతుర్మాస దీక్ష సమాప్తం

అంగరంగ వైభవంగా గ్రామ ప్రవేశం

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సీమోల్లంఘన శోభాయమానంగా జరిగింది. చాతుర్మాస దీక్ష ముగియడంతో శనివారం రాత్రి సీమోల్లంఘన వైభవంగా నిర్వహించారు. పండితుల వేద ఘోషలు, పుష్పవృష్టి, భక్తజనుల కోలాహలం మధ్య పీఠాధిపతి వైభవంగా ఊరేగారు. ముందుగా స్వామిజీ రాఘవేంద్రుల ఆశీస్సులు తీసుకుని ప్రత్యేక పల్లకీలో బయలు దేరారు. స్థానిక కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం వాయుదేవుడికి విశేషాత్మక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అలంకరణ అశ్వవాహనపై ఆశీనులై పట్టణంలోని రాఘవేంద్ర సర్కిల్‌ చేరుకున్నారు. బాజాభజంత్రీలు, వేద పఠనాలతో స్వామిజీకి ఆహ్వానం పలుకగా భారీగా బాణా సంచా పేల్చి పుష్పాల వాన కురిపించారు. అడుగడుగునా ఆధ్యా త్మిక సంబరం ఉట్టి పడుతుండగా భక్త జనులకు ఆశీర్వాదాలు ఇస్తూ స్వామిజీ ఊరేగింపు ముందుకు సాగింది. స్థానిక సర్కిల్‌ నుంచి అశేష భక్తజనుల ప్రదర్శనల నడుమ ప్రధాన ఆర్చి మీదుగా మధ్వ కారిడార్‌ వీధుల్లో ఊరేగుతూ పీఠాధిపతి శ్రీమఠం చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement