విద్యార్థి మృతిపై ముమ్మర విచారణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి మృతిపై ముమ్మర విచారణ

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

చరిత్ర, సంస్కృతిపై అవగాహన ఉండాలి

కొలిమిగుండ్ల(అవుకు): పట్టణంలోని సెయింట్‌ మేరీ స్కూల్‌ విద్యార్థి అనుమానాస్పద మృతికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు కీలకం కానున్నాయి. కొలిమిగుండ్ల మండలం బెలుంకు చెందిన తోక సురే ష్‌, ఇందిరమ్మ దంపతుల కుమారుడు నిఖిల్‌ (13) పాఠశాలలో 8వ తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈనెల 23న ముగ్గురు సహచర విద్యార్థులతో కలిసి తెల్లవారుజామున రెండు గంటలకు హాస్టల్‌ నుంచి బయటకు వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఢిల్లీ బజార్‌ ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభం వద్ద విద్యార్థి నిఖిల్‌ మృతదేహమై కనిపించాడు. దీనిపై పోలీసులు ప్రాథమికంగా విద్యుఘాతంతో మృతి చెందాడని నిర్ధారించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంలోని సీసీ పుటేజీలను పరిశీలించగా విద్యార్థి మృతికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నా యి. ఢిల్లీ బజార్‌లోకి వెళ్లి మృతి చెందినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విద్యార్థి మృతిపై ఒకటి, రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కర్నూలు కల్చరల్‌: చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖాధికారి ఎం.ఇ.తిరుమల నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. సెట్కూరు సీఈఓ డాక్టర్‌ కె.వేణుగోపాల్‌, మెప్మా పీడీ శ్రీనివాసులు, ఆర్‌ఐవో లాలెప్ప మాట్లాడుతూ.. కర్నూలు నగర చారిత్రక, సాంస్కృతిక వైభవం, వారసత్వాన్ని ప్రజలు, యువత, పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు వారసత్వ కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా పర్యాటక శాఖ హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తోందన్నారు. తిరుమల నాయుడు మాట్లాడుతూ.. శనివారం ఉదయం 6 గంటలకు కర్నూలు నగర వనంలో ‘ప్రకృతి ఒడిలో ప్రాతఃకాలపు నడక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కొండారెడ్డి బురుజు ప్రాంతంలో మొక్కలు నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement