బతుకుదెరువుకు వచ్చి మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

బతుకుదెరువుకు వచ్చి మృత్యువాత

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

● కేసీలోకి దూసుకెళ్లిన స్కూటర్‌

● వ్యాపారి దుర్మరణం

పగిడ్యాల: జీవనోపాధి కోసం రెండు నెలల క్రితం ముచ్చుమర్రి గ్రామానికి వచ్చిన ఓ వ్యాపారి ప్రమాదవశాత్తు కేసీ కాలువలో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లు పట్టణానికి చెందిన వాల్మీకి వెంకటేశ్వర్లు (62) గృహోపకరణాలైన మిక్సీలు, ఫ్యాన్లు, కూలర్స్‌, కుక్కర్లు తదితర సామగ్రిని ప్రజలకు నెలసరి వాయిదాలకు విక్రయించేవారు. తొమ్మిదేళ్లుగా పగిడ్యాల మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యాడు. వ్యాపార రీత్యా ఉదయం నెహ్రూనగర్‌ గ్రామానికి స్కూటర్‌పై సామగ్రి తీసుకెళ్లాడు. అక్కడ వ్యాపారం ముగించుకుని తిరిగి ముచ్చుమర్రికి కేసీ కాలువ గట్టుపై వస్తుండగా మార్గం మధ్యలో స్కూటర్‌ అదుపుతప్పి కేసీ కాలువలోకి దూసుకెళ్లింది. కాల్వలో నీరు ఉండటంతో స్కూటర్‌తో పాటు మునిగి మృతి చెందాడు. తర్వాత నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని లస్కర్‌ వెంకటరమణ గుర్తించి ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సిబ్బందితో పాటు వెళ్లి మృతదేహాన్ని, స్కూటర్‌ను బయటకు తీయించి కుటుంబీకులకు సమాచారం తెలిపారు. మృతుడి కుమారుడు త్రినాథ్‌కుమార్‌ కూడా పగిడ్యాలలో వాయిదా పద్ధతిలో గృహోపకరణాలు విక్రయిస్తుంటాడని వెల్లడించారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement