17 మద్యం దుకాణాలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

17 మద్యం దుకాణాలకు గెజిట్‌ నోటిఫికేషన్‌

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

కర్నూలు: జిల్లాలో మద్యం దుకాణాల అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి ముందుకు రాని 17 దుకాణాలకు జిల్లా కలెక్టర్‌ అనుమతితో ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ జిల్లా అధికారి సుధీర్‌ బాబు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశా రు. జిల్లాలో మొత్తం 106 మద్యం దుకాణాలు ఉండగా 92 దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయ్యింది. లైసెన్స్‌ రెన్యువల్‌ గడువు ముగిసినందున మిగిలిన 14 దుకాణాలతో పాటు గతంలో మూసివేసిన మరో మూడు దుకాణాల ను కలిపి మొత్తం 17 దుకాణాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ దుకాణాల లైసెన్సు కోసం ఆన్‌లైన్‌లో హైబ్రిడ్‌ మోడ్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఆఫ్‌ లైన్‌ విధానంలోనూ మాన్యువల్‌గా దరఖా స్తు చేసుకుని ఎకై ్సజ్‌ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి దుకాణానికి 4 దరఖాస్తులు వస్తేనే దానికి లక్కీడిప్‌ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్‌ 1వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అక్టోబర్‌ 5న జెడ్పీలో కలెక్టర్‌ సమక్షంలో లాటరీ తీసి లక్కీడిప్‌ తగిలిన వారికి లైసెన్సు జారీ చేయనున్నట్లు ఈఎస్‌ సుధీర్‌ బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement