డోన్ టౌన్: ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన బ్యాగును పోలీసులకు అప్పజెప్పి ఆటోడ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. వివరాలు.. ప్యాపిలి మండలం ఊటకొండ గ్రామానికి చెందిన తెలుగు చిరంజీవి భార్య లీలావతి కొచ్చెర్వు గ్రామానికి చెందిన ఆటోలో ఎక్కి డోన్‌కు వెళ్లారు. పట్టణంలోకి ప్రవేశించిన తరువాత పిల్లలను ఆటో నుంచి దింపుకోవడంలో హ్యాండ్‌బ్యాగును మరచి వెళ్లిపోయారు. ప్యాసింజర్లు అందరూ దిగిపోయాక డ్రైవర్‌కు ఆటోలో హ్యాండ్‌బ్యాగు కనిపించింది. ఆటో డ్రైవర్లు సాంబ, శ్రీనివాసులు బ్యాగును తెరచి చూడగా రూ.8500 నగదు, సెల్‌ఫోన్‌తో పాటు విలువైన వస్తువులు ఉన్నాయి. వెంటనే పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి బ్యాగును అందజేశారు. ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి విచారణ జరిపి హ్యాండ్‌బ్యాగ్‌ను మరిచి వెళ్లిన మహిళను గుర్తించారు. సీఐ ఇంతియాజ్‌బాషా ఆదేశాలతో సదరు మహిళను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బ్యాగును అప్పజెప్పారు. బ్యాగును నిజాయితీగా తిరిగిచ్చిన ఆటోడ్రైవర్లను అభినందించారు.


