నులిపురుగులను నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

నులిపురుగులను నివారిద్దాం

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

● కలుషిత ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి.. ● చిన్నారుల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు ● ఎదుగుదల లోపించే ప్రమాదం ● ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మాత్రల పంపిణీకి చర్యలు ● నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం

● కలుషిత ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి.. ● చిన్నారుల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు ● ఎదుగుదల లోపించే ప్రమాదం ● ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మాత్రల పంపిణీకి చర్యలు ● నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం

గోస్పాడు: పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు ఆరోగ్యమే ప్రధానం. చిన్నారులను పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగు లు పిల్లల కడుపులో చేరి మెలిపెడుతూ పిల్లల్లో పేలతనం, నీరసం, ఆహారం సరిగా తీసుకోకపోవడం తరచూ కనిపిస్తుంటుంది. వారి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంటా యి. రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. నిర్లక్ష్యంగా ఉంటే జీవితాలనే నులిమేస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏడాదికి రెండుసార్లు జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1–19 ఏళ్ల పిల్లల్లో నులిపురుగుల సమస్య ఉంటుంది. ఒక్క ఆల్బెండ్‌జోల్‌ మాత్రతో ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యు లు చెబుతున్నారు. ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం రోజున అంగన్వాడీలు, పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది.

నులిపురుగులతో నష్టదాయకం

నులిపురుగులు పిల్లల పేగుల్లో పెరిగే పరాన్నజీవులు. ఇవి అపరిశుభ్రమైన చేతులు, కలుషితమైన ఆహారం, నీటిద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం ఇచ్చే ఆహారాన్ని పిల్లల శరీరం గ్రహించకుండా ఈ పురుగులు అడ్డుకుంటాయి. తద్వారా రక్తహీనతకు దారితీస్తాయి. మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. కడుపునొప్పి, వికారం కలగజేస్తాయి. ఆహారం సహించదు, ఆకలి ఉండదు. నీరస ంగా ఉంటుంది.పిలల కడుపులో కొంకి, నులి, బద్దె, గుండ్రని పురుగులు రక్తాన్ని పీల్చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆల్బెండజోల్‌ మాత్రల డోస్‌ ఇలా..

నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 1 – 2 ఏళ్ల చిన్నారులకు సగం మాత్ర (200 ఎంజీ) నీటిలో కలిపి తా పాలి. 2–19 ఏళ్లలోపు పిల్లలకు 400 ఎంజీ మాత్ర ను మధ్యాహ్నం భోజనం తరువాత చప్పరించేలా చూడాలి. ఈ మాత్రలను దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. ఇది సురక్షితమైనది.

4,46,400 మందికి ఆల్బెండజోల్‌ మాత్రలు

జిల్లాలో 1663 అంగన్వాడీ కేంద్రాల్లోని 94,355 మంది పిల్లలు, 2950 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని 3,52,045 మందికి, కళాశాలల్లో ఆల్బెండజోల్‌ మాత్రలు వేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. 1–2 ఏళ్ల పిల్లలు 19,331 మంది, 2–19 ఏళ్ల పిల్లలు 4,27,069 మంది మొత్తంగా 4,46,400 మంది ఉన్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరికి ఆల్బెండజోల్‌ మాత్రలు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నారు. ఈ నెల 25న మాత్రలు తీసుకోని వారుంటే అక్టోబర్‌ 5న మరోమారు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రలు అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement