పొట్ట కూటికి వలస వెళ్లి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

పొట్ట కూటికి వలస వెళ్లి దుర్మరణం

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

● కోమాలో మరొకరు, ఇంకొకరికి తీవ్రగాయాలు ● మూడు ఇళ్లలో విషాదం

● కోమాలో మరొకరు, ఇంకొకరికి తీవ్రగాయాలు ● మూడు ఇళ్లలో విషాదం

ఆదోని రూరల్‌: ఆదోని మండలంలోని పెద్దతుంబలం గ్రామానికి చెందిన వలస కూలీ దాసరి తిమ్మప్ప (32) బెంగళూరులో నిర్మాణ పనులు చేస్తూ ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందాడు. గురువారం బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మప్ప, భార్య సుజాత, నలుగురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తాపీ బేల్దారిగా పనిచేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. బెంగళూరులోని జంగని ప్రాంతంలో ఐదో అంతస్తులో గోడ నిర్మాణ పనులు చేస్తుండగా సపోర్టు ఉన్న తాడు తెగడంతో ముగ్గురు కూలీలు కింద పడ్డారు. తిమ్మప్ప తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక మృతిచెందాడు. మరో వ్యక్తి కోమాలో ఉండగా, మూడో వ్యక్తికి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారని, అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారని బంధువులు తెలిపారు. దీంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది.

ప్రభుత్వం ఆదుకోవాలి

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తిమ్మప్ప మృతితో భార్య, నలుగురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వలస వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం, ఇతర సంక్షేమ పథకాల ద్వారా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement