రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

● మరో నలుగురికి గాయాలు ● లారీని ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం

● మరో నలుగురికి గాయాలు ● లారీని ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం

ఓర్వకల్లు: ముందుగా వెళుతున్న లారీని వెనక నుంచి అతి వేగంగా వచ్చిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొట్టిన ఘటన ఓర్వకల్లు వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌ నుంచి బద్వేల్‌కు 18 మంది ప్రయాణికులతో ట్రావెల్‌ బస్సు బయలుదేరింది. ఉదయం 5.30 గంటల సమయంలో ఓర్వకల్లు వద్ద డ్రైవర్‌ నిద్రమత్తుతో ముందుగా వెళుతున్న లారీని బస్సు ఢీకొట్టింది. బస్సును సడన్‌ బ్రేకు వేయడంతో డ్రైవర్‌ వెనకాల సీటులో పడుకున్న.. వైఎస్సార్‌ కడప జిల్లా గోపవరం మండలం సుమిత్రనగర్‌కు చెందిన రామాంజనేయులు (20) అలియాస్‌ నాని ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన రక్తగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హైవే పెట్రోలింగ్‌ వాహనంలో, మృతి చెందిన యువకుడిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement