బనగానపల్లె:
మండలంలోని కాపులపల్లి గ్రామానికి చెందిన బి.రామలక్ష్మమ్మ (42) గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం అర్ధరాత్రి సమయంలో పేడరంగు ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ గురువారం తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో విష ద్రావణం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ తెలిపారు. భర్త నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు సంతాపం ఉన్నారు.
యువకుడిపై కత్తితో దాడి
ఆదోని అర్బన్: పట్టణంలోని క్రాంతినగర్‌లో పవన్‌యశ్వంత్ అనే యువకుడిపై గురువారం తెల్లవారుజామున అదే కాలనీకి చెందిన చిలక రవి, మరో ముగ్గురు కత్తితో దాడి చేశారని టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పవన్‌యశ్వంత్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అర్ధరాత్రి సమయంలో బెంగళూరుకు వెళ్లేందుకు క్రాంతినగర్ కాలనీలో నడుచుకుంటూ అరుస్తూ వెళ్తున్నాడని తెలిపారు. అదే కాలనీకి చెందిన చిలక రవితో పాటు మరో ముగ్గురు ఆ యువకుడిని ఎందుకు అరుస్తున్నావని నిలదీశారు. మాటామాటా పెరిగి చిలక రవి మరో ముగ్గురు కత్తితో పవన్‌యశ్వంత్‌పై దాడి చేశారు. గాయపడిన పవన్‌యశ్వంత్‌ను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


