తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

మంత్రాలయం రూరల్‌: మండల కేంద్రంలోని రామచంద్ర నగర్‌కు తాగునీరు నిలిపివేయడంతో మహిళలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. బుధవారం ఖాళీ బిందెలతో రాఘవేంద్ర సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. వారు మట్లాడుతూ.. రామచంద్రనగర్‌లో 20 రోజుల నుంచి కుళాయిలకు నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీనిపై అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నా చేపట్టమన్నారు. ఇప్పుడే నీరు లేకపోతే ఎండకాలం పరిస్థితి ఎలాగో అర్థం కావడం లేదని వాపోయారు. దాదాపు గంటకు పైగా రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎస్‌ఐ మల్లికార్జున, డిప్యూటీ ఎంపీడీఓ ఉపేంద్రరెడ్డి అక్కడకు చేరుకుని మహిళలతో మాట్లాడి రస్తారోకో విరమింపజేశారు. అనంతరం మహిళలు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఽనిరసన చేపట్టారు. తహసీల్దార్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ రమాదేవికి వినతి పత్రం ఇచ్చారు. స్పెషల్‌ ఆఫీసర్‌ మట్లాడుతూ.. సమస్య పరష్కారమయ్యే వరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామన్నారు. రూ.20 లక్షలతో పైపులైన్‌ ఏర్పాటు చేశామని నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement