పాణ్యం: గోరుకల్లు ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టి గేటు ఎత్తిన వారిని వెంటనే గుర్తించాలని సీఈ కబీర్‌బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం గోరుకల్లు జలాశయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. డ్యామ్ వద్ద తప్పకుండా లస్కర్లు ఉండాలని, రాత్రింవబళ్లు విధులు నిర్వహించాలని ఆదేశించారు. గేటు ఎత్తిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని గ్రామంలో విచారించాలన్నారు. అనంతరం ఎస్సార్‌బీసీ కాల్వను పరిశీలించారు. బైపాస్ కెనాల్ వద్ద భారీగా కోతకు గురైన ప్రాంతాన్ని చూశారు. ఎస్సార్‌బీసీ ప్రధాన కాల్వ వద్ద కోతకు గురి కావడంతో ప్రమాదకరంగా మారిందని, వెంటనే తక్షణమే మరమ్మతులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి యాథావిధిగా కాల్వ సపోర్టును నిర్మించాలన్నారు. బాధుల్యైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. సీఈ వెంట ఎస్‌ఐ ప్రతాప్, ఈఈ భవానీప్రసాద్‌రెడ్డి, డీఈలు గీతావాణి, జ్యోతి, సిబ్బంది అహృత్‌సాగర్ సిబ్బంది తదితరులు ఉన్నారు.


