హైకోర్టు సీజేతో భేటీ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు సీజేతో భేటీ

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

కర్నూలు: హైకోర్టు శాశ్వత బెంచ్‌ కర్నూలులో ఏర్పాటు చేయాలన్న అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్‌తో సోమవారం జిల్లా న్యాయవాదులు సమావేశమయ్యారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టు సీజేను కలిసి చర్చించారు. భౌగోళికంగా అన్ని అర్హతలున్నప్పటికీ కర్నూలు జిల్లాపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీజేకు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై సీజే సానుకూలంగా స్పందించినట్లు సంఘం అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. సీనియర్‌ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, జయరాజ్‌, నాగేంద్ర, ఓంకార్‌, చాంద్‌ బాషా, కేసీ రాముడు, భావన కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ సుమన రాణి, తదితరులు పాల్గొన్నారు.

పట్టపగలే చోరీ

ఆదోని అర్బన్‌: పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మారుతి ఎస్టేట్‌లో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని కురువ తిమ్మప్ప తెలిపిన మేరకు వివరాలు.. తిమ్మప్ప ఓ ప్రైవేట్‌ సంస్థలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తోంది. ఇద్దరు కలిసి బయటకు వెళ్లగా.. గమనించిన గుర్తు తెలియని దుండగుడు ఇంటి తాళాలు పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి అదులోని ఐదు తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.30 వేలు నగదును అపహరించుకుని వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా.. తలుపులు పగలగొట్టిన దృశ్యాన్ని చూసి వెంటనే చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్న తిమ్మప్ప టూటౌన్‌ పోలీసులను సమాచారమిచ్చాడు.

అనారోగ్యంతో 15 ఏళ్ల విద్యార్థి మృతి

హాలహర్వి: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రుక్మిణి, నాగేష్‌ దంపతుల కుమారుడు జగదీష్‌ (15) అనారోగ్యంతో మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. విద్యార్థి స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. జగదీష్‌కు మూడు రోజుల క్రితం వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు హాలహర్విలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదోనికి, అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. కడుపు, పేగులు, అపెండిక్స్‌కు సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నాడని డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు బోరుమని విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement