● అక్టోబర్ 15న కంకణాధారణ
● 21న మాళ మల్లేశ్వరస్వామి
కల్యాణోత్సవం, ‘బన్ని’ ఉత్సవం
హొళగుంద: రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న దేవరగట్టు శ్రీమాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలకు సంబంధించి సోమవారం నెరణికి గ్రామంలో పురోహితులు ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఉత్సవాల ఆహ్వాన ప్రతిని దేవరగట్టు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దల సమక్షంలో పురోహితులు రవిశాస్త్రి విడుదల చేశారు. త్వరలోనే కరపత్రాలను ముద్రించి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు దేవరగట్టు ఆలయ భక్త మండలి సభ్యులు తెలిపారు.
బన్ని ఉత్సవ వివరాలివీ..
● అక్టోబర్ 15వ తేదీ గురువారం దేవరగట్టులో మాత మాళమ్మ మల్లేశ్వరునికి కంకణధారణ, నిశ్చితార్థం.
● అక్టోబర్ 21వ తేదీ బుధవారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని, జైత్రయాత్ర
● 22వ తేది గురువారం భవిష్యవాణి(దైవవాణి)
● 23న శుక్రవారం సాయంత్రం స్వామివారి రథోత్సవం.
● 24న శనివారం గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం.
● 25వ తేది ఆదివారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.


