సమాజానికి వెలుగుజాడ గురజాడ | - | Sakshi
Sakshi News home page

సమాజానికి వెలుగుజాడ గురజాడ

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

● జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు(సెంట్రల్‌): తన రచనలతో గురజాడ అప్పారావు సమాజానికి వెలుగుజాడ చూపారని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మహాకవి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జేసీ మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్‌ 21న జన్మించారన్నారు. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి, సాహిత్యాన్ని సామాన్య ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. తెలుగు నాటక సాహిత్యంలో కన్యాశుల్కం విశిష్ట స్థానాన్ని సంపాదించుకుందన్నారు. దేశమును ప్రేమించుమన్నా వంటి రచనలు ప్రజల్లో దేశభక్తి, సమాజంపై బాధ్యతాభావాన్ని పెంపొందించాయన్నారు. తెలుగు భాషా సాహిత్యానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలన్నారు. ఆయన రచనల్లోని సామాజిక సందేశాలను ఆచరించాల్సిన అవసరం ఉందని జాయింట్‌ కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివప్రసాద్‌ రెడ్డి, సీపీవో భారతి, డీఈవో జి. సుధాకర్‌ , సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లోకరాజు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధికా, నైపుణ్యాభివృద్ధి, అధికారి దీప్తి, డి.ఎస్‌.డి.వో భూపతి రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement