● రాంబొట్ల దేవాలయం వద్ద ఉదయం 9 గంటలకు నిమజ్జనోత్సవ మొదటి ఊరేగింపు ప్రారంభమవుతుంది.
● మధ్యాహ్నం 12 గంటకు హనుమాన్ జంక్షన్ వద్ద రెండో ఊరేగింపు, 2 గంటలకు కల్లూరు చౌరస్తా వద్ద మూడో ఊరేగింపు, అదే సమయానికి నంద్యాల చెక్ పోస్టు వద్ద నాలుగో ఊరేగింపు ప్రారంభమవుతుంది.
● వినాయక్ ఘాట్‌లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.
● మధ్యాహ్నం ఒంటి గంటకు వినాయక ఘాట్‌లో నిమజ్జనం ప్రారంభమవుతుంది.
● వినాయక ఉత్సవాల సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ ఇస్తారు.
● గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి నగర అధ్యక్షులు ఎస్.రంగస్వామి, ప్రధాన కార్యదర్శి ిసీవీ గిరిరాజ వర్మ, జిల్లా సంఘట కార్యదర్శి రాజేశ్ శర్మ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.


