స్క్రీనింగ్‌ సమయం తగ్గించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్క్రీనింగ్‌ సమయం తగ్గించుకోవాలి

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

స్క్రీనింగ్‌ సమయం తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల పాత్ర కీలకం అల్జీమర్స్‌ను ముందుగా గుర్తిస్తే మేలు

టీవీ, మొబైల్‌, కంప్యూటర్‌ చూడటం వంటి స్క్రీనింగ్‌ సమయాన్ని తగ్గించుకుని, మెదడుకు నిరంతరం మేత వేసే ఫజిల్స్‌, పుస్తక పఠనం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా యువత భవిష్యత్‌లో ఈ ముప్పు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. చికిత్స కంటే నివారణే ఎల్లప్పుడూ ఉత్తమం. మతిమరుపు సంకేతాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

– ఎం.యతిరాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్‌, కర్నూలు

మతిమరుపు పెరుగుతున్నప్పుడు సాధారణమైన విషయంగా భావించి ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. రోగి అర్థం చేసుకునే విధంగా కుటుంబసభ్యులు సహకరించడం, ఓర్పుతో వ్యవహరించడం, వైద్యుల సూచనలను పాటించడం చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తి మార్పులతో పాటు ఆలోచనా విధానం, ప్రవర్తన, రోజువారీ కార్యకలాపాల్లో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. –డాక్టర్‌ ఎం.నాగసురేష్‌,

న్యూరోఫిజిషియన్‌, కర్నూలు

అల్జీమర్స్‌ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించడం వల్ల రోగికి అవసరమైన చికిత్స, భవిష్యత్‌ సంరక్షణను ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంపిక చేసిన ప్రారంభ దశ అల్జీమర్స్‌ రోగుల్లో అమీలాయిడ్‌ను లక్ష్యంగా చేసుకునే చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. – డాక్టర్‌ చల్లేపల్లి బాబూరావు, న్యూరాలజిస్టు, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement