చదువు కావాలంటే బరువు మోయాల్సిందే అన్నట్టు ఉంది.. హొళగుంద జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల పరిస్థితి. గురువారం పాఠశాలకు చెందిన కొంత మంది విద్యార్థులు మంచినీటి క్యాన్‌ను అష్టకష్టాలు పడ్తూ మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన చాలా మంది అయ్యో.. పాపమన్నారు. పాఠశాలలో ఎవరు పంపించారో తెలియదు గాని.. పాఠశాలకు దాదాపు అర కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉన్న వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తీసుకెళ్లేందుకు విద్యార్థులు వచ్చారు. అయితే నీటితో నింపిన క్యాన్‌ను విద్యార్థులు పాఠశాలకు చేర్చేందుకు నానా అవస్థలు పడ్డారు. కొద్దిసేపు మోస్తూ.. దించుతూ అతి కష్టం మీద పాఠశాలకు తీసుకెళ్లారు. ఇది విద్యార్థుల నీళ్లు మోయిస్తారా.. అంటూ తిట్టుకుంటూ విద్యా హక్కు చట్టం అంటే ఇదేనా.. అని ప్రశ్నిస్తున్నారు. – హొళగుంద


