శోభాయాత్రలో పాల్గొన్న ప్రజలు
ఆదోనిలో శుక్రవారం గణేశ్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తప్పెట్లు, చెక్కభజనలు, బ్యాండు మేళాలు, డీజే సౌండ్ల మధ్య ప్రజల్లో ఉత్సాహం ఉరకలేసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. ఆదోని పట్టణ వీధులన్నీ గణేశ్ శోభాయాత్రలతో సందడిగా మారాయి. చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ రోడ్లపైకి తరలివచ్చి గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. – ఆదోని


