కోడుమూరు రూరల్: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని కోడుమూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మతసామరస్యం వెల్లివిరిసింది. సర్కిల్ కార్యాలయంలో సీఐ తబ్రేజ్ గణనాథుడిని కొలువుదీర్చగా వినాయక మండపాల సభ్యులతో పాటు కోడుమూరులోని మసీ దు కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొని గణనాథుడికి సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. వినాయక చవితి భారతీయులందరి పండుగ అని, నాడు బ్రిటిష్ పాలనలో భారతీయలంతా కలిసికట్టుగా ఉండాలన్న సంకల్పంతో స్వాతంత్య్ర సరమయోధుడు బాలగంగాధర్ తిలక్ గణేషుడి ఉత్సవాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశా రు. ప్రజలంతా కలిసికట్టుగా కులమతాలకతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సీఐ సూచించారు.


