స్థానిక ఎన్నికలకు సిద్ధమవుదాం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు సిద్ధమవుదాం

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేద్దాం

అధికార పార్టీ బెదిరింపులకు భయపడేది లేదు

చంద్రబాబుకు రైతుల కష్టాలు కనిపించవు

డీఎస్సీలో అనర్హులకు పోస్టులు

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

మంత్రాలయం: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుదామని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాంపురం గ్రామంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కార్యకర్తలు, నాయకులకు తమ కుటుంబం అండ గా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పోలీసులు, అధికారులు స్థానిక ఎన్నికల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిని వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం సూపర్‌–6ను గాలికి వదిలేసిందన్నారు. ఏదీ కూడా పూర్తి స్థాయిలో అమలు నూచుకోలేదన్నారు. వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబుకు కనిపించదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా చేయించి రైతులను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారన్నారు. ఊరూరా కనిపించే సచివాలయం, ఆర్‌బీకె, హెల్త్‌ సెంటర్లు నిర్మించింది జగనన్ననే అన్నారు. తుంగ భద్ర నది అడుగంటి తీర ప్రాంత గ్రామాల ప్రజలు సాగు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం ..

స్థానిక ఎన్నికల్లో ఊరూరా అందరి ఆమోదంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిలబెట్టి అత్యధిక మెజార్జీటతో గెలిపించి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందిద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ బెదిరింపులతో ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే ప్రతి నాయకుడు అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శులు మురళీమోహన్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, మండల కన్వీనర్లు ప్రహ్లాదచారి, బెట్టనగౌడు, రాంమోహన్‌రెడ్డి, ఎల్‌ఎల్‌సీ డిస్టిబ్యూటర్‌ మాజీ అధ్యక్షులు ఐరన్‌గల్‌ శ్రీనివాసరెడ్డి, లీగల్‌ సెల్‌ కార్యదర్శి గురురాజరావు, ఎంపీపీ ఈరన్న, నాయకులు మాబుసాబ్‌, ఏకాంబర్‌రెడ్డి, మాజీ సర్పంచులు తెల్లబండ్ల భీమ, రామాంజినేయులు, రోగెప్ప, నాగరాజు, ముకరన్న, రమేష్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

డీఎస్సీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి...

డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వెంటనే సీబీఐతో దర్యాప్తు చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 6 నుంచి 10 మంది అనర్హులు డీఎస్సీలో పోస్టులు పొందారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. పోస్టులు పొందిన వారి ధ్రువీకరణ పత్రాలు చూపించవద్దని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. డీఎస్సీలో తప్పులను కప్పి పుచ్చడానికి మంత్రి నారా లోకేష్‌ ప్రయత్నం చేస్తున్నారన్నారు. డీఎస్సీపై పూర్తి స్థాయిలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణమన్నారు. 2027లో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనడం హాస్యాస్పదమన్నారు. జగనన్న అగుడు బయటపెడితే జనసునామి వెంట నడుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతులు మీదుగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఐడీ కార్డులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement