కొత్తపల్లి: రోజు రోజుకు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. దీంతో శ్రీశైలం వెనుకజలాల నుంచి మండలంలోని సంగమేశ్వరం సమీపంలో ప్రాచీన సంగమేశ్వరాలయం బయల్పడుతోంది. మంగళవారం ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిఖరభాగం వద్ద శివపార్వతుల విగ్రహాలు ఉంచి వినాయకుడి పూజలతో 43 రోజుల పాటు నిర్వహించే వరుణ పూజలు ప్రారంభించారు. శిఖరభాగానికి కుంకుమార్చన, పుష్పార్చ న, కాయ కర్పూరం సమర్పించారు.


