● ఎకై ్సజ్ బకాయిలు లేనివారు రెన్యువల్‌కు అర్హులు ● ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మచ్చ సుధీర్ బాబు
కర్నూలు(అర్బన్): ఎకై ్సజ్ బకాయిలు లేని వాళ్లు మాత్రమే రెన్యువల్ దరఖాస్తుకు అర్హులని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మచ్చ సుధీర్ బాబు తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల లైసెన్స్‌దారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 2026–27 సంవత్సరానికి మద్యం షాపుల రెన్యువల్‌కు సంబంధించిన విధి విధానాలను వివరించారు. రెన్యువల్ ప్రాసెస్‌కు పాటించాల్సిన విధానాలను పీపీటీ రూపంలో లైసెన్స్‌దారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా లైసెన్స్‌దారులు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో కర్నూలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ చంద్రహాస్, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


