16 ఎకరాల్లో పత్తి సాగు చేశాం. అంతరపంటగా కంది వేసుకున్నా. రెండున్నర నెలలుగా చినుకు జాడ లేదు. పత్తి, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నా యి. ఎకరాకు సగటున రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొత్తంగా రూ.3.20 లక్షల వరకు పెట్టుబడిని కోల్పోయాం. గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు.
– శ్రీనివాసరెడ్డి, రైతు, వెల్దుర్తి
సొంత పొలం ఆరు ఎకరాలు ఉంటే, 34 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇప్పటి వరకు మిర్చి 10 ఎకరాలు, కంది 15 ఎకరాలు, సద్దలు 8 ఎకరాల ప్రకారం 33 ఎకరాల్లో పంటలు వేశాం. వర్షాలు లేకపోవడం వల్ల ఏడు ఎకరాలు ఖాళీగా ఉంది. సాగు చేసిన పంటలకు ఎకరాకు రూ.15వేల ప్రకారం రూ.4.95 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఎకరాకు కౌలు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. పంటలు పండకపోయినప్పటి కౌలు మాత్రం రూ.3.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.8.35 లక్షలు నష్టం వాటిళ్లుతోంది. కరువు మా జీవితాన్ని పూర్తిగా కాటేసింది.
– లింగరాజు, రైతు, మద్దికెర


