ఎండుతున్న పొలాన్ని చూసి ఆగిన రైతు గుండె | - | Sakshi
Sakshi News home page

ఎండుతున్న పొలాన్ని చూసి ఆగిన రైతు గుండె

Sep 4 2026 1:36 AM | Updated on Sep 4 2026 1:36 AM

మహానంది: మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బండారు శేఖర్‌ (45) ఎండుతున్న పొలాన్ని చూసి ఆవేదనతో గుండెపోటుకు గురై గురువారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన శేఖర్‌ తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు 5.50 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల వర్షాలు లేక వరి పంట ఎండిపోవడంతో ఆందోళన చెందాడు. ఈ మేరకు గత రెండు రోజుల నుంచి పొలం ఎండిపోతోందని కుటుంబ సభ్యులతో చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. పొలం ఎండిపోతే పోయింది.. అప్పులు ఎలాగైనా తీర్చుకుందామని కుటుంబ సభ్యులు ఓదార్చుతూ వచ్చారు. అయినప్పటికీ మనోవేదనకు గురైన ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిచెందిన శేఖర్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement