కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని దిశ, వన్‌స్టాప్ సెంటర్‌ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు సంబంధించి రిజిస్టర్‌లను పరిశీలించారు. వన్‌స్టాప్ సెంటర్‌లో చేరే వారి వివరాలను, వారి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సంబంధిత సంతకాలు కచ్చితంగా తీసుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు విక్టిమ్ కాంపెన్సేషన్ త్వరగా అందేలా కృషి చేయాలని అక్కడి సిబ్బందికి చెప్పారు. అక్కడున్న నివాసితులకు లీగల్ సర్వీసెస్ యాక్ట్ – 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులని తెలిపారు. వారి భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన సమస్యలు వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్‌చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.


