గూడురులోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీకి ఇప్పటివరకు అడ్రసు బదలాయించుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఈ ఏడాది నాలుగు ప్రైవేటు కాలేజీలు సైతం ట్రస్ట్ పేరు, కాలేజీ పేరు ఫ్రాంచైజీల పేరుతోనే మార్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకొని భారీగా ఫీజులు వసూలు చేసి అడ్మిషన్లు చేసుకున్నారు. గత నెల 31లోపు షిఫ్టింగ్‌కు బోర్డు అధికారులు ఇచ్చిన గడువు సైతం ముగిసింది. ఈలోపే అనుమతులు తీసుకుంటామని రాజకీయ ఒత్తిళ్లు చేసి అడ్మిషన్లు చేసేసుకొని తరగతులు నిర్వహిస్తున్నారు. కాలేజీ షిఫ్టింగ్, కాలేజీ పేరు మార్పునకు ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడం గమనార్హం.


