వెల్దుర్తి: పాయసం సేవించి వెల్దుర్తి 15వవార్డు కొండ పేటలో నివాసముంటున్న 70 ఏళ్లు పైబడిన ఎల్లయ్య, మాదక్క దంపతులు కోమాలోకి వె వెళ్లిపోయారు. పాయసం ఇచ్చిన వారు మాదక్క బంగారు కమ్మలు అపహరించారని వృద్ధుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధ దంపతులైన ఎల్లయ్య, మాదక్క బుధవారం సాయంత్రం తమ ఇంటి సమీపంలో అక్రమంగా సారా వ్యాపారం చేస్తున్న ఇంటి వద్దకు వెళ్లారు. ఆ ఇంటి వారు వృద్ధ దంపతులకు పాయసం ఇవ్వడంతో సేవించారు. అనంతరం ఇంటికి చేరుకున్న వారిలో మాదక్క కోమాలోకి వెళ్లిపోగా, ఎల్లయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఇంటికి వచ్చి గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యానికి 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తారు. ఎల్లయ్య, మాదక్కలకు ఏదో మత్తు కలిపిన పాయసం ఇచ్చి, మాదక్క బంగారు కమ్మలు అపహరించారని బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అస్వస్థతకు గురైన ఎల్లయ్య, మాదక్క


