కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి బుధవారం నుంచి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం కర్నూలు అధ్యక్షులు డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ హైకోర్టు నిర్ణయాన్ని అనుసరించి, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మా డిమాండ్లను న్యాయసమ్మతమైనవని హైకోర్టు పేర్కొంటూ.. ప్రభుత్వం, ఏపీ జూడాల మధ్య చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు రెండు వారాల సమయం ఇచ్చిందన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ ఏపీ జూడా రెండు వారాల పాటు సమ్మెను నిలిపివేసిందన్నారు. బుధవారం నుంచే జూనియర్ డాక్టర్లందరూ తిరిగి విధుల్లో చేరి, యథావిధిగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గురువారం మంగళగిరిలో ప్రభుత్వం, ఏపీ జూడా ప్రతినిధుల మధ్య అధికారిక చర్చలు జరగనున్నాయని, ఈ చర్చల ద్వారా తమ న్యాయమైన డిమాండ్లకు సరైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
శ్రీశైలం నుంచి 43వేల క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి మంగళవారం నుంచి బుధవారం వరకు దిగువ ప్రాజెక్ట్‌లకు 43,036 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 14.663 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 29,586 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. బుధవారం సాయంత్రం సమయానికి ఎగువ జూరాల నుంచి శ్రీశైలానికి 14,359 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 162.0554 టిఎంసీల నీరు నిల్వగా ఉండగా, డ్యాం నీటిమట్టం 874.70 అడుగులకు చేరుకుంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు తిరగకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు రౌడీయిజం చేశారు. డోన్ మండలం జగదుర్తిలో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారు. ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాజేశ్వరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కోదండరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరి కొంత మంది పట్టుడు కర్రలతో దాడి చేసినట్లు గాయపడిన వారు తెలిపారు. వైఎస్‌స్రా్‌సీపీ నాయకులు మోహన్‌రెడ్డి, రఘునాథరెడ్డి, ఉప్పరి వెంకటేశ్వర్లు, బోయ సుంకన్న, బోయ సురేష్ ఇళ్లకు వెళ్లి దాడి చేసినట్లు బాధిత కుటుం సభ్యులు తెలిపారు. దాడిలో మోహన్‌రెడ్డి, రఘునాథరెడ్డి త లలకు బలమైన తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో వీరిని గ్రామస్తులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు.


