తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని తేరన్నపల్లి క్రాస్ సమీపంలో లారీ డ్రైవర్ నాగేంద్ర (46) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తాడిపత్రి అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాలమేరకు... నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రానికి చెందిన నాగేంద్ర 20 ఏళ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 2న గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన క్లీనర్ రామకృష్ణారెడితో కలిసి మంగళూరుకు లారీ లోడ్ తీసుకొని వెళ్లారు. ఈనెల 8న భార్య వెంకటలక్ష్మికి నాగేంద్ర ఫోన్ చేసి కొందరితో గొడవ జరిగిందని చెప్పాడు. ఆమె భయంతో తాడిపత్రి అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నాగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించినట్లు సీఐ పేర్కొన్నారు. అయితే తేరన్నపల్లి క్రాస్ వద్ద నాగేంద్ర శవాన్ని కొనుగొన్నామని తెలిపారు. అధిక మద్యం కారణమా, లేక లారీ యజమాని, క్లీనర్‌తో జరిగిన గొడవలో చనిపోయాడా అన్నది తేలాల్సి ఉందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.


