శ్రీమఠం పీఠాధిపతి చాతుర్మాస దీక్ష | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠం పీఠాధిపతి చాతుర్మాస దీక్ష

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

నేటి నుంచి జూడాల సమ్మె

మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సోమవారం తెల్లవారుజామున చాతుర్మాస దీక్షను స్వీకరించారు. మంగళవాయిద్యాల నడుమ పండితులు, శ్రీమఠం అధికారులు సంప్రదాయ బద్ధకంగా స్వాగతం పలికారు. చాతుర్మాస దీక్షలో భాగంగా శ్రీమూల రాములకు పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష స్వీరించిన సందర్భంగా శ్రీరాఘవేంద్రస్వామి, శ్రీవాధీంద్ర తీర్థులు బృందావనాలన్నింటికి ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు ఇచ్చారు. పీఠాధిపతికి 48రోజుల పాటు ఎటువంటి ధార్మిక పర్యటనలు ఉండవు అని శ్రీమఠం అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 26వతేదీన సీమోంఘన మహోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.

జూనియర్‌ డాక్టర్ల నిరసన

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

కర్నూలు(హాస్పిటల్‌): తమకు స్టైఫండ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అంతకు ముందు వారు ఏపీ జూనియర్‌ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రిలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఇంటర్నీస్‌, జూనియర్‌ రెసిడెంట్లు, సూపర్‌స్పెషాలిటీ పీజీలు, డీఆర్‌పీ/ఫెరిఫెరల్‌ పోస్టింగ్‌లోని పీజీలు, సీనియర్‌ రెసిడెంట్‌లు పాల్గొన్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): స్టైఫండ్‌ పెంపును కోరుతూ ఈ నెల 11వ తేదీ నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఏపీ జూనియర్‌ డాక్టర్ల సంఘం కర్నూలు అధ్యక్షులు డాక్టర్‌ నిశాంత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 11వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఆసుపత్రిలోని అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించి వైద్యసేవలు నిలిపివేస్తామన్నారు. అత్యవసర సేవలు, అన్ని ఐసీయు సేవలు కొనసాగిస్తామన్నారు. 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం కాని వైద్యసేవలు నిలిపివేస్తామన్నారు. 15వ తేదీన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తామన్నారు. అయినా లిఖిత పూర్వక స్పందన అందని పక్షంలో 16వ తేదీ నుంచి ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు.

‘స్క్రబ్‌వర్క్‌’ పేరుతో మోసం

కర్నూలు: ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయమై విజయవాడకు చెందిన ఎంటర్‌పైజెస్‌లో స్క్రబ్‌ వర్క్‌ బిజనెస్‌ పేరుతో ఇంటి వద్దే ప్యాకింగ్‌ పనిచేస్తే నెలకు రూ.24 వేలు ఆదాయం వస్తుందని నమ్మించి, ముడిసరుకు మిషన్ల కోసం 54 మంది నుంచి సుమారు రూ.కోటి పెట్టుబడికి తీసుకుని ఒక వ్యక్తి మోసం చేశారని ఎమ్మిగనూరుకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన సమర్పించిన వినతిపత్రంలో కోరారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, ఇస్మాయిల్‌, మస్తాన్‌ వలి తదితరులు పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

‘రెవెన్యూ’ అర్జీలే అధికం

కర్నూలు(సెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌కు రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి సూచించారు. సర్వే, పీఆర్‌, మునిసిపల్‌ అర్జీలు అదే స్థాయిలో వస్తున్నాయని, ప్రజలతో నేరుగా మాట్లాడి వాటి ని పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీ నూరుల్‌ ఖమర్‌తో కలసి జిల్లా కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పీజీఆర్‌ఎస్‌ అర్జీల ను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు అనూరాధ, శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement