మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి ఆదివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మూలబృందవనానికి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఏకాదశి కావడంతో పంచామృతాభిషేకాలు, అలంకరణలు నిర్వహించలేదు. నిజరూప మూల బృందవానంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ మంచాలమ్మ దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్పతరు క్యూకాంపెక్స్, వీఐపీ క్యూలైన్‌లో భక్తుల రద్దీ కనిపించింది.


