ఇబ్బందులు పడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు పడుతున్నాం

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

ఇబ్బందులు పడుతున్నాం వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి

మాకు ఒకటిన్నర ఎకరాలు మాత్రమే భూమి ఉంది. సజ్జ, కంది సాగు చేస్తే దెబ్బతిన్నాయి. జూన్‌ నుంచి ఉపాధి పనులకు వెళ్తున్నాం. రెండు నెలలుగా కూలి రావడం లేదు. కుటుంబం గడవడటం కష్టంగా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే కూలి డబ్బులు చెల్లించాలి.

– చిరంజీవి దంపతులు,

కోతికొండ గ్రామం, తుగ్గలి మండలం

సాధారణంగా వ్యవసాయ సీజన్‌లో ఉపాధి పనులకు 60 రోజుల విరామం ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో అన్ని పంచాయతీల్లో పనులు చేపడుతున్నాం. కొన్ని వారాలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే పడే అవకాశం ఉంది. నరేగా నుంచి వీబీజీ రామ్‌జీలోకి మారాం. కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం.

– నరసింహారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌,

వీబీజీ రామ్‌ జీ, డ్వామా, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement