తల్లిదండ్రులకు భారం కాకూడదని.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు భారం కాకూడదని..

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

కొత్తపల్లి: అనారోగ్యం బారి న పడిన యువకుడు తల్లిదండ్రులకు భారం కాకూడ దని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఏఎస్‌ఐ రామ్‌నాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. ఎదురుపాడు గ్రామానికి చెందిన చాకలి దినేష్‌ కుమార్‌ (22) డిప్లొమా చదువును మధ్యలో ఆపేసి గ్రామంలో తండ్రి వద్ద ఉంటున్నాడు. చదువు పూర్తి చేయనందున ఉద్యోగాలు రావని ఆందోళన చెందడం, గతంలో హ్యాండ్‌ వాల్‌ క్రీడలో స్టేట్‌ లెవల్‌కి ఎంపిక కాలేక పోవడంతో తీవ్రంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఎక్కువగా ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోయి ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో అతని తండ్రి వైద్య ఖర్చులకు దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈ విషయంపై కూడా దినేష్‌ కుమార్‌ ఎక్కువగా ఆలోచించి తన తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తండ్రి నాగశేషులు గమనించి వెంటనే వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గోస్పాడు: పసురపాడు – బనగానపల్లె రహదారిలో తేళ్లపురి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన రమేష్‌ (45) బనగానపల్లెలోని హెరిటేజ్‌లో పనిచేస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం విధులకు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా తాడిపత్రి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement