శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక విశేష క్రతువులు రెండవ రోజు కొనసాగాయి. శనివారం వేదపండితులు రుష్యశృంగ జపాన్ని చేశారు. రుష్యశృంగ మహర్షి కొలువు ఉన్న చోట్ల వర్షాలు సమృద్ధిగా పడతాయని శాస్త్రం చెబుతుందని, ఆయన అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురవాలని, కరువుకాటకాలు నివారించబడాలని రుష్యశృంగమహర్షి మట్టి ప్రతిమను పూజించారు. అలాగే వారుణానుకం మంత్రాలను వేదపండితులు పారాయణ చేశారు. భాగవతం, మహాభారతంలోని విరాటపర్వం పారాయణలు చేశారు. మరోవైపు వరుణజపం, పంచాక్షరిజపం, మూలమంత్రజపాలు చేశారు. వరుణజపం నీటిలో ఉండి చేయాలని శాస్త్రం చెబుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన నీటితోట్టిలో పండితులు కంఠం వరకు మునిగేలా కూర్చోని ఆయా జపాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తిణ్యహవచనం, చండీశ్వ రపూజ, కంకణపూజ, కంకణధారణ,రుత్విగ్వరణం, సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం, ఉపాంగ దేవతాహవనములు, జపా ంగ హవనములు జపిరిస్తారు. ఆ తరువాత ఏకాదశ రుద్ర రుషశృంగ సహిత సహస్ర ఘటస్థాపన, కలశార్చనలు, రుద్రపారాయణలు జరిపిస్తారు.


