కర్నూలు కల్చరల్: ప్రముఖ కవి అనిల్ డ్యానీకి కాశీభట్ల పురస్కారం ప్రదానం చేశారు. అక్షరం ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం కృష్ణా నగర్‌లోని సర్వేపల్లి పాఠశాలలో కాశీభట్ల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పాఠశాల అధినేత శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు అరుణ దంపతులు అక్షరం ట్రస్ట్ ప్రతినిధులు అనిల్ డ్యానీ దంపతులకు రూ. 25 వేలు అందజేసి సన్మానించారు. కాశీభట్ల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో కవి పలమనేరు బాలాజీ, ట్రస్ట్ కార్యదర్శి వెంకట కృష్ణ, సాహతీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్, ప్రసిద్ధ కథకులు మారుతీ పౌరోహితం , ప్రముఖ కవి ముప్పాల శ్రీరామ్, ట్రస్ట్ సభ్యులు అవిజ వెంకటేశ్వరరెడ్డి, కవులు డాక్టర్ హరికిషన్, జంధ్యాల రఘుబాబు, గద్వాల ఈరన్న, ఎస్‌డీవీ అజీజ్, డాక్టర్ కోటకండ మనోహర్, కల్యాణదుర్గ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.


