● ఎస్సీలకు బడ్జెట్‌లో కేటాయింపులే తప్ప అమలులో శూన్యం ● ఆలిండియా దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జేబీ రాజు
కర్నూలు(అర్బన్): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆలిండియా దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డు ఐఐఎస్ అధికారి జేబీ రాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సా మాజిక న్యాయం, ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల పరిక్షణ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గురువారం ఇక్కడకు వచ్చారు. ముందుగా ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు అధ్యక్షతన స్థానిక టౌన్ మోడల్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేబీ రాజు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌లో కొన్ని హామీలను అరకొరగా అమలు చేశారని, మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ఉన్నత విద్యకు సంబంధించి రూ.9 వేల కోట్ల ఫీజు బకాయి పెట్టారన్నారు. దీని వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా రుణాలు అందించిన దాఖలాలు లేవన్నారు. బడ్జెట్‌లో కేవలం కేటాయింపులు చేస్తున్నారే తప్ప, నిధులు విడుదల చేయడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బలహీన వర్గాలన్నీ ఏకమై ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎస్సీసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా పద్మావతి
రాష్ట్ర షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షురాలిగా యు.పద్మావతిని ఎన్నుకున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.జయరాజు, సలహాదా రు ఎన్‌సీహెచ్ బజారన్న, అధ్యాపకులు గంగాధర్, నాయకు లు రామాంజనేయులు, బాలనారాయణ, రాహుల్‌కుమార్,చంద్రశేఖర్,జోత్స్నదేవి, మద్దయ్య పాల్గొన్నారు.


