బంగారు పాదుకలు సమర్పణ | - | Sakshi
Sakshi News home page

బంగారు పాదుకలు సమర్పణ

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో గురువారం రోజున శ్రీరాఘవేంద్రస్వాముల వారికి బంగారు కవచంతో తయారు చేసిన పాదుకలను శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సమర్పించారు. పండితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆశ్రమం నుంచి బృందావనం చెంతకు చేర్చారు. ఆరాధనోత్సవాల ముందస్తులో భాగంగా మూల రాముల బృందావనం ముందు ఉంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి మహామంగళ హారతులు గావించారు. మూలబృందావనం ముందు వెండి పాదుకల స్థానంలో ప్రత్యేక ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన సువర్ణ పాదుకలను శ్రీరాఘవేంద్రస్వాములకు సమర్పించినట్లు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. అనంతరం భక్తులకు బంగారు పాదుకలు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా శ్రీమఠంలో ఊంజల మండపం నుంచి బంగారు పలకీల్లో మూలబృందావనం ప్రతిమను ఉంచి మఠం ప్రాంగణంలో మంగాళ్య వాయిద్యాలు, భక్తుల నడుమ ఊరేగించారు. శ్రీమఠం కారిడార్‌లో భక్తుల సందడి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement