ఆసుపత్రికి ఎక్కువగా వివిధ ప్రమాదాల్లో గాయపడి ఎముకలు విరిగిన వారు వస్తుంటారు. వీరితో పాటు ఓపీ చికిత్సకు వివిధ రకాల ఎముకలు, నొప్పులతో వస్తుంటారు. వారికి ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, కొన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. అవసరమైన మందులు సూచిస్తున్నాం. నొప్పులు ఉన్నా యని పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం ప్రమాదకరం. అవి క్రమంగా కడుపులో మంటతో పాటు కిడ్నీలను దెబ్బతీస్తాయి. వైద్యుల సూచన మేరకే వాడాలి.
– డాక్టర్ ఎం.రాజేష్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ విభాగం, కర్నూలు జీజీహెచ్


