ఒక శాసనసభ్యుడికి పోలీసులు కనీస మర్యాదు కూడా ఇవ్వలేదు. రాత్రివేళ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగల మాదిరిగా, టెర్రరిస్టుల్లా తీసుకుపోవడం అత్యంత దుర్మార్గం. ఈ రోజు పోలీసులు తమ ధర్మాన్ని మర్చిపోయి టీడీపీ నాయకుల ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నారు. బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే తీసుకోరు. కానీ దౌర్జన్యం చేసిన టీడీపీ ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా క్యాడర్‌ను భయభ్రాంతులకు గురి చేయాలనే ఈ విధంగా పోలీసులతో చేయిస్తున్నారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కసి పెరుగుతుందే తప్ప ఎవ్వరూ భయపడరు. 2029లో మళ్లీ జగన్‌ను సీఎంగా చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం.
– కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు


