● భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త
● బళ్లారిలోని ఆంఽధ్రాళ్ ప్రాంతంలో దారుణం
సాక్షి,బళ్లారి: కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం పెంచుకున్న కిరాతక భర్త ఏడు నెలల పసికందును, భార్యను దారుణంగా హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బాళ్లారి నగర శివార్లలో 8వ వార్డు పరిధిలోని ఆంధ్రాళ్ ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. ఆంధ్రాళ్‌లో నివాసం ఉంటున్న హొన్నూరప్ప(28), తన భార్య రాజేశ్వరి(24)ని, కుమార్తె అశ్విని(1)ని దారుణంగా హత్య చేశాడు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే ఎస్పీ సుమన్ పన్నేకర్, డీఎస్పీ, సీఐలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన రాజేశ్వరికి హొన్నూరప్పతో పెళ్లయింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే చివరి సంతానం అశ్విని తనకు పుట్టలేదంటూ భార్య శీలంపై అనుమానం పెంచుకుని తరచు గొడవ పడేవాడు. చివరకు పసికందును, భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పథకం ప్రకారం భార్యను, పసికందును సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానే హత్య చేసినట్లు చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డిగ్రీ సప్లిమెంటరీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు htt ps://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. రెండవ సెమిస్టర్‌కు సంబంధించి 454 పేపర్స్‌కు దరఖాస్తు చేసుకోగా 152, నాల్గవ సెమిస్టర్‌కు సంబంధించి 587 పేపర్స్‌కు దరఖాస్తు చేసుకోగా 283 పేపర్స్ ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
అశ్విని
(ఫైల్)
హొన్నూరప్ప, రాజేశ్వరి (ఫైల్)


