ఆలయాలు, గ్రంథాలయాలనూ వదల్లేదు! | - | Sakshi
Sakshi News home page

ఆలయాలు, గ్రంథాలయాలనూ వదల్లేదు!

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): అంతా వారిష్టం.. మార్గదర్శకాలు పట్టించుకోరు.. వివిధ రూపాల్లో నిధులు దుర్వినియోగం చేస్తారు. టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు కావడంతో ఈ బాగోతం సాగుతోంది. స్టేట్‌ ఆడిట్‌(లోకల్‌ ఫండ్‌) అధికారుల తనఖీల్లో వారి అక్రమాలు బహిర్గతం అయ్యాయి. స్థానిక సంస్థలు, దేవాలయాలు, గంథ్రాలయాలు, యూనివర్సిటీలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు తదితర వాటికి వచ్చిన నిధులు, వాటి వినియోగంపై స్టేట్‌ అడిట్‌ అధికారులు ప్రతి సంవత్సరం ఆడిట్‌ చేస్తారు. ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరం లావాదేవీలు, ఖర్చులపై ఆడిట్‌ జరుగుతోంది.

అక్రమాలు ఇవీ..

చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరం నిర్వహించిన ఆడిట్‌లో నిధుల వినియోగానికి సంబంధించి 18,799 అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం రూ.38.13 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించి రూ.77.30 కోట్లు దుర్వినియోగం అయినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించి 2,413 ఆడిట్‌ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. నిబంధనలు ఉల్లంఘించి రూ. 23.34 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అలాగే రూ.21.21 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను చూపలేదు. ఇదిలా ఉండగా ఎంపీ నిధులకు సంబంధించి రూ.181 కోట్లు, రాయలసీమ యూనివర్సిటీ నిధుల్లో రూ.51.15 కోట్లు దుర్వినియోగం అయినట్లు వెల్లడైంది. దేవాలయాల్లో ఏకంగా రూ.799 కోట్లు ఆడ్డుగోలుగా వినియోగించినట్లు సమాచారం.

చర్యలు శూన్యం

నిధుల వినియోగానికి సంబంధించి అనేక లొసుగులు వెల్లడైనప్పటికీ, రూ.కోట్లు దుర్వినియోగం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వేలాది ఆడిట్‌ అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత చూపుతోంది. ఆడిట్‌ అభ్యంతరాలు, సర్‌చార్జ్‌ సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోయింది. ఆడిట్‌ అభ్యంతరాలు గుట్టల కొలది పేరుకపోయి ఉన్నప్పటికీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు, యూనివర్సిటీలకు, గంథ్రాలయాలకు నిధుల విడుదల ఆగడం లేదు. దీంతో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలోనూ నిధుల దుర్వినియోగం

రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రూ.368.28 కోట్ల దుర్వినియోగం అయినట్లు ఆడిట్‌ అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి 25,827 అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2014–15 సంవత్సరానికి సంబంధించే రూ.45.03 కోట్ల నిధుల దుర్వినియోగానికి 7,352 ఆడిట్‌ అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే 2018–19లో రూ.98.15 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్‌ అధికారులు తేల్చారు. ఇందుకు సంబందించి 2,463 అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క నిధులు కొల్లగొట్టినట్లు ఆడిట్‌లో అక్రమాలు వెలుగు చూశాయి. సాధారణంగా ప్రతి ఏటా ఆడిట్‌ పూర్తి చేసిన తర్వాత సేట్‌ ఆడిట్‌ జిల్లా అధికారులు నివేదికను స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌కు పంపుతారు. అక్కడి నుంచి ఆడిట్‌ అభ్యంతరాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నివేదిక ఆయా శాఖల హెచ్‌వోడీలకు వెళ్తుంది. అక్కడి నుంచి చర్యలు మొదలు కావాలి. కాని ఆడిట్‌ నివేదికలు హెచ్‌ఓడీల దగ్గర మరుగున పడిపోతున్నాయి.

వివిధ పనుల్లో అడ్డుగోలుగా నిధులు స్వాహా

స్టేట్‌ ఆడిట్‌ నివేదికలో అక్రమాల నిర్ధారణ

నాటి టీడీపీ పాలనలో రూ.368 కోట్ల

దుర్వినియోగం

2024–25లో 18,799 అభ్యంతరాలు

ఈ ఏడాది ఇంకా ఎన్నెన్నో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement