మహానంది: మహానంది క్షేత్రంలో గురుపౌర్ణమి సందర్భంగా కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఆలయ అర్చకులు మణికంఠశర్మ, ఏఈఓ ఎరమల మధు, అర్చకులు పుల్లూరు హరికుమారశర్మ, ధర్మతేజ ఉదయం నుంచి విశేష పూజలు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌కు చెందిన మార్కెట్ శ్రీకాంత్ బృందం, కర్నూలు మార్కెట్ నుంచి గిరిధర బృందం వారు సుమారు రెండు వేల కిలోల అన్ని రకాల కూరగాయలను అలంకరణ నిమిత్తం అందించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


