నూతన పరిశోధనలపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

నూతన పరిశోధనలపై దృష్టి పెట్టాలి

Jul 30 2026 4:42 AM | Updated on Jul 30 2026 4:42 AM

కర్నూలు సిటీ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ఐటీడీఎం)లో బుధవారం డాక్టోరల్‌ కో లోక్వియం (పరిశోధన విద్యార్థుల సదస్సు) నిర్వ హించారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థల పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు. తమ పరిశోధనలను ప్రదర్శించడంతో పాటు, నిపుణుల సూచనలు పొందుతూ పరస్పర విద్యా, పరిశోధనా అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సులో వరంగల్‌ నీట్‌ ఆచార్యులు డాక్టర్‌ వై.శ్రీనివాసరావు మేధోసంపత్తి హక్కులు, పరిశోధనలో నైతిక అనుభవాలు అనే అంశంపై మలేషియాకు చెందిన ఆచార్యులు సి.వై టింగ్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏఐ అండ్‌ కంప్యూటింగ్‌ అంశంపై ఎల్సేవియర్‌ పబ్లిషర్స్‌ సంస్థకు చెందిన పరిశోధన రైటర్‌ శివాలిక నాణ్యమైన శాసీ్త్రయ పరిశోధనా వ్యాసాల రచన, సరైన జర్నల్‌ ఎంపిక, వ్యాస నిర్మాణం, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రచురణకు అవసరమైన అంశాలను వివరించారు. అలాగే రీసెర్చ్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించారు. పరిశోధనా ప్రదర్శనలను ఐఐటీ, నీట్‌, ట్రిపుల్‌ఐటీల నుంచి వచ్చిన ఎక్స్‌టర్నల్‌ నిపుణుల బృందం మూల్యాంకనం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ.50 వేల నగదు బహుమతి అందజేశారు. ట్రిపుల్‌ఐటీ డీఎం ఆచార్యులు కె.సత్యబాబు, రోహిత్‌కుమార్‌, దాస్‌ సయన్వయంతో సదస్సు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement