ప్లాస్టిక్‌ పంట పండింది.. కాలుష్యం నవ్వింది! | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ పంట పండింది.. కాలుష్యం నవ్వింది!

Jul 28 2026 1:06 AM | Updated on Jul 28 2026 1:06 AM

ప్రకృతిని కాలుష్యం కాటేస్తోంది. పచ్చని పంటలు పండే భూములను ప్లాస్టిక్‌ భూతం మింగేస్తోంది. పాలకులు, అధికారులు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూన్నారే కానీ.. అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువుల నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్లాస్టిక్‌ కవర్ల కలిగే అనర్థాలపై ప్రజలకు సరైన అవగాహన కరువైంది. దైనందిన జీవితంలో భాగమై పూలు, పండ్లు, ఆకుకూరలు, చికెన్‌, మటన్‌, స్వీట్లు, పాలు, బ్రెడ్డు.. ఇలా అన్నీ కవర్లలో ఇంటికి చేరుతున్నాయి. దుకాణాలు, హోటళ్లలో యథేచ్ఛగా వినియోగిస్తున్నా అడిగేవారు లేరు. కోడుమూరులోని వెల్దుర్తి రోడ్డులో డంపింగ్‌యార్డ్‌లో పారవేసే చెత్తలో ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు గాలికి కొట్టుకుపోయి సమీపంలోని పొలాలను కప్పేస్తున్నాయి. ప్లాస్టిక్‌ రహిత పట్టణాలు, గ్రామాలుగా మార్చాలన్న ప్రభుత్వ చర్యలు గాలిమాటలే అనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. – కోడుమూరు రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement