పీఎన్‌ఎం 11వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వీధి నాటకోత్సవాలు ఆదివారం ఆకట్టుకున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు మార్కెట్ యార్డులోని కళా వేదికలో కర్నూలు జిల్లా కళాకారులు ప్రదర్శించిన డప్పుల నృత్యం ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా కళాకారులు ప్రదర్శించిన ఆజాది డ్యాన్స్, టామీటామీటామీ వీధి నాటిక, కర్నూలు జిల్లా కళాకారులు ప్రదర్శించిన పోతులూరి వీరబ్రహ్మం నృత్యరూపకం ఆలరించింది. పశ్చిమ గోదావరి జిల్లా కళాకారులు ప్రదర్శించిన మన్యం విప్లవం వీధి నాటకం, పోలవరం జిల్లా కళాకారులు ప్రదర్శించిన అమ్మ పేకనులు మేసీ డ్యాన్స్, నెల్లూరు జిల్లా కళాకారులు ఏకులం నీది వీధి నాటికలు ఆకట్టుకున్నాయి. వివిధ జిల్లాకు చెందిన కళాకారులు అబ్బురపరచే కళలు, నృత్యాలను ప్రదర్శించి ఆకట్టకున్నారు.


