ఉడుముల వేటగాడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉడుముల వేటగాడు అరెస్ట్‌

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

బండిఆత్మకూరు: నారపురెడ్డి కుంట అటవీ ప్రాంతంలో అక్రమంగా ఉడుములను పట్టుకున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించా మని బండి ఆత్మకూరు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి నాసీర్‌ ఝా ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన సుబ్బా రావు శనివారం సాయంత్రం నారపురెడ్డి కుంట నార్త్‌ బీట్‌లో బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు ఉడుములను స్వాధీనం చేసుకున్నామని, అందులో ఒకటి మృతి చెందడంతో డాక్టర్లు పోస్ట్‌ మార్టం చేసి దహనం చేశారన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, నిందితుడు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్‌ ఆఫీసర్స్‌ ఖాశీం నాయక్‌, నాగరాజు, శ్రీధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఆదోని అర్బన్‌: ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన మున్సిపల్‌ శానిటేషన్‌లో ఉద్యోగం చేస్తున్న చిన్న ఈరన్న (35) ఆదివారం ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఆదోని పట్ట ణంలోని సాయిబాబానగర్‌ కాలనీకి చెందిన చిన్న ఈరన్న తొమ్మిది నెలల క్రితం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఆమె తన తల్లి ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లి ఇంటి తాళాలు ఇప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శిరీష మధ్యాహ్నం ఒంటి గంటకు తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికులను పిలిపించి వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఆదోని జిల్లా సాధనపై నోరుమెదపని టీడీపీ నాయకులు

ఆదోని సెంట్రల్‌: ఆస్పరి మండలంలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశంలో ఆదోని జిల్లా చేయాలని టీడీపీ నాయకులు మాట్లాడక పోవడం విచారకరమని ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దస్తగిరి ఆదివారం పేర్కొన్నారు. ఆదోని జిల్లా చేస్తామని చెప్పడంలో టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి విఫలమయ్యారన్నారు. వినతిపత్రం అందిద్దామని ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ సభ్యులు కుంకునూరు వీరేష్‌, అయ్యాలప్ప వంటి సభ్యులతో కలసి వెళితే కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. చివరికి సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజీఅర్‌ఎస్‌లో ఇచ్చి పీఎంఓ కార్యాలయానికి అప్‌లోడ్‌ చేయించి వచ్చామని తెలిపారు. ఆదోని జిల్లా రాకుండా అడ్డుపడుతున్న మంత్రి టీజీ భరత్‌ను, టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.

‘యముడు’

చిత్ర బృందం సందడి

ఆళ్లగడ్డ: యముడు చిత్ర బృందం ఆదివారం పట్టణంలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా వచ్చిన బృందం సభ్యులు ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండు, రామలక్ష్మీ థియేటర్‌ల సమీపంలో తిరుగుతూ పోస్టర్లు పంచారు. ఆగస్టు 7న విడుదల కానున్న ఈ సినిమాలో రాయలసీమ వాసి జగద్‌ హీరోతోపాటు దర్శక, నిర్మాత బాధ్యతలు నిర్వహిచడం జరిగిందని, అందరూ ఆదరించాలని వారు కోరారు.

విద్యుదాఘాతంతో

మహిళ మృతి

కొలిమిగుండ్ల: మండల పరిధిలోని పెద్దవెంతుర్లలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బోయ కుమారి (48) భర్త చంద్రమోహన్‌తో కలిసి సొంత పొలంలో మొక్క జొన్న పంటకు మందు పిచికారి చేసేందుకు ఇంటి నుంచే స్పేయర్‌ డబ్బాతో బయలుదేరారు. ఈ క్రమంలోనే పొలంలో కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు డబ్బాను తగలడంతో కుమారి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు చికిత్స నిమిత్తం వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement