ఏపీఆర్‌ఎస్‌ఏ ఎన్నికలు ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

ఏపీఆర్‌ఎస్‌ఏ ఎన్నికలు ఏకగ్రీవం

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

కర్నూలు(సెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌ఏ) కర్నూలు డివిజన్‌ యూనిట్‌ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ధనంజయరెడ్డి ప్యానల్‌ ఘన విజయం సాధించింది. అధ్యక్ష, కార్యదర్శులుగా బి.ధనుంజయరెడ్డి, బి. గురుస్వామి రెడ్డి, ట్రేజరర్‌గా కె.సందీప్‌నాయక్‌తోపాటు 16 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఆర్‌డీఓ కార్యాలయ మీటింగ్‌ హాలులో కర్నూలు డివిజన్‌ యూనిట్‌ ఎన్నికలను ఎన్నికల అధికారి వెంకటేశ్వరరెడ్డి నిర్వహించారు. అయితే ధనుంజయరెడ్డి ప్యానల్‌ మాత్రమే పోటీలో దిగడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష, కార్యదర్శులతోపాటు అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఆర్‌.విష్ణుప్రసాదు, ఉపాధ్యక్షులుగా ఎం.ప్రీతం, ఎస్‌ అన్వర్‌బాషా, జె.షర్మిళారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా బి.విష్ణుమాధవ, జి.తరుణ్‌, బి.గోవిందు, ఈసీ మెంబర్లుగా వై.అఖిలేశ్వరరెడ్డి, ఎ.అబ్దుల్‌రజాక్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులుగా కె.కె. మృదుల, కె.రాజేశ్‌ యాదవ్‌, రవి ప్రకాష్‌, ఎస్‌.రాజునాయక్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు డివిజన్‌ యూనిట్‌ను జిల్లా అధ్యక్షుడు సి.నాగరాజు, కర్నూలు, సి.బెళగల్‌, వెల్దుర్తి తహసీల్దార్లు రమేష్‌బాబు, వెంకటలక్ష్మి, చంద్రశేఖరశర్మ అభినందించారు. అంతకముందు కొత్త కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్ష, కార్యదర్శులు బి.ధనుంజయరెడ్డి, బి.గురుస్వామిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement