ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత...! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత...!

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

మహానంది దేవస్థానానికి

ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు

13 మంది ట్రస్ట్‌సభ్యులతో జీఓ జారీ

మహానంది: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానానికి ట్రస్ట్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కన్నబాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితో పాటు తదితర ఆలయాలకు ట్రస్ట్‌బోర్డు సభ్యులను ఏర్పాటు చేసింది. అయితే మహానంది దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ గిరి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు పోటీ పడటంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో రెండున్నరేళ్లు గడిచినా ఇంత వరకు పాలకమండలి సభ్యులను నియమించలేదు. ఎట్టకేలకు తాజాగా 12 మంది ట్రస్ట్‌బోర్డు సభ్యులతో పాటు ఒక ఎక్స్‌ అఫిషియో సభ్యుడు కలిసి 13 మందితో కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. మసీదుపురం గ్రామానికి చెందిన నరాల చంద్రమౌళీశ్వర రెడ్డి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా తురగ నాగలక్ష్మమ్మ, ఎం. కాశీనాయక్‌, పొత్తూరు ధనూష, లాలం నాగార్జున, అన్నెపోగు విజయుడు, చింతా నాగేశ్వరరావు, కాటేపోగు రామేశ్వరమ్మ, ముక్కమల్ల ఆదిశేషుడు, కొల్లి దీప, గుద్దేటి రమాదేవి, అనురాధతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మలను నియమిస్తూ జీఓ ఆర్‌టీ నెంబర్‌ 1267 జారీ చేశారు. త్వరలోనే వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement